లాక్ డౌన్ కారణంగా కృష్ణాజిల్లా పెదపారుపూడిలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు స్థానికంగా నివాసముండే కిషోర్ బాబు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. సుమారు ఆరు లక్షల 50 వేల రూపాయల వ్యయంతో ఆరు రకాల నిత్యావసర సరకులను గ్రామంలోని వెయ్యి కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ విధంగా పేదలకు సహాయం చేయడం తనకెంతో ఆనందం కలిగించిందని కిషోర్ తెలిపారు.
పెదపారుపూడిలో పేదలకు నిత్యావసరాల పంపిణీ - lockdown effect on people
లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు పలువురు సహాయం చేస్తున్నారు. ఈ ఆపద సమయంలో మేమున్నామంటూ ముందుకు వచ్చి తమ వంతు తోడ్పాటు అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
పెదపారుపూడిలో పేదలకు నిత్యావసరాల పంపిణీ