కృష్ణా జిల్లా పెనమలూరు ఎంజీఆర్ ట్రస్ట్ అధినేత గంగారావు తన వంతు సహాయంగా ప్రెస్ క్లబ్ సభ్యులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. పోలీసులు, హోంగార్డులతో పాటు చల్లపల్లిలోని వృద్ధాశ్రమాలలోని వృద్ధులు, నిరుపేదలకు వస్తువులు అందజేసి దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
అత్యవసర సేవలందిస్తున్న సిబ్బందికి నిత్యావసరాలు పంపిణీ - కృష్ణా జిల్లా నేటి వార్తలు
కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రజలను రక్షించే క్రమంలో అనుక్షణం శ్రమిస్తున్న సిబ్బందికి సహాయం చేసేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. తమకు తోచినంత సహాయం అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
అత్యవసర సేవలందిస్తున్న సిబ్బందికి నిత్యావసరాలు పంపిణీ