లీలాకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ - Distribution of essential needs
కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలో లీలాకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వలస కార్మికులు, రోజువారి కూలీలకు నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ చేశారు.
![లీలాకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ Distribution of essential commodities](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7247034-71-7247034-1589796923049.jpg)
లీలాకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ
కృష్ణాజిల్లా కైకలూరు నియోజకవర్గంలో లీలాకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వలస కార్మికులు, రోజువారి కూలీలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్డౌన్ నియమ నిబంధనలకనుగుణంగా ఈ కార్యక్రమం కొనసాగింది. తమ వ్యాపారం లాక్డౌన్ వల్ల తాత్కాలికంగా నిలిచినా...కార్మిక కుటుంబాలకు కొంత సాయం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఫౌండేషన్ నిర్వహకులు శివరాం, భువన్ తెలిపారు.