పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరకులు పంపిణీ - vijayawada latest news
లాక్డౌన్తో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు మూతబడ్డాయి. మందిరాల్లోకి భక్తులను అనుమతించకపోవడంతో బ్రాహ్మణులు, పురోహితులకు ఆదాయం తగ్గిపోయింది. ఫలితంగా వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వీరి ఇబ్బందులను గుర్తించిన విజయవాడ సత్యనారాయణపురం గాయత్రి సొసైటీ సభ్యులు... వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
విజయవాడ సత్యనారాయణపురం గాయత్రి సొసైటీ ఆధ్వర్యంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు... బ్రాహ్మణులు, పురోహితులకు నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా పురోహితులు పనులు లేక ఇబ్బందులు పడటాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న వారందరినీ ప్రభుత్వం, వివిధ స్వచ్ఛంద సంస్థల తరుఫున సహాయం అందిస్తున్నామని విష్ణు తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు పాటిస్తూ గృహాలకే పరిమితం కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇదీచదవండి.