కృష్ణా జిల్లాలో...
కాలినడకన, రైళ్లలో స్వస్థలాలకు వెళుతున్న వలస కూలీలకు.. విజయవాడలోని స్వచ్ఛంద సంస్థలు ఆహార, పానీయాలు అందచేశాయి. కేరళలోని కొట్టాయం నుంచి లక్నోకు వెళ్తున్న శ్రామిక్ రైలు విజయవాడలో కొద్దిసేపు ఆగింది. ఆ సమయంలో వలస కూలీలకు జ్యూస్, బిస్కెట్, మజ్జిగ, అరటికాయలను అమృత హస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కరుణశ్రీ అందచేశారు. రైలులో 1600 మందిగా పైగా ప్రయాణికులున్నట్లు ఆమె తెలిపారు.
కృష్ణా జిల్లా మైలవరంలో సాయిసేవాదళ్ ఆధ్వర్యంలో మండుటెండలో ప్రయాణిస్తున్న బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఎండల తీవ్రత తగ్గేవరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని సేవాదళ్ అధ్యక్షుడు బాలాజీ ప్రసాద్ తెలిపారు.
చేనేత కార్మికులకు చల్లపల్లి మండలం పురిటిగడ్డలో ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ అధినేత డాక్టర్ వేములపల్లి సురేష్ ఆపన్న హస్తం అందించారు. 150 కుటుంబాలకు బియ్యం, కందిపప్పు, నూనె ప్యాకేట్ తో కలిపిన నిత్యావసర కిట్లను అందించారు. ముఖ్య అతిధిగా చల్లపల్లి తహసీల్దార్ కె. స్వర్ణమేరి పాల్గొన్నారు.
కోడూరు లోని వీవర్స్ కాలనీలో 400 కుటుంబాలకు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు చేతుల మీదుగా కూరగాయల పంపిణీ చేసారు.
తూర్పుగోదావరి జిల్లా...
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలోని జాతీయ రహదారిపై సీఐటీయూ ఆధ్వర్యంలో వలస కూలీల కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దాతల సహకారంతో రహదారులపై లారీల్లో, బస్సుల్లో వెళ్లే వలస కూలీల కు అల్పాహారం, భోజన సదుపాయాన్ని అందించారు. 1000 ఆహార పొట్లాలు తయారుచేసి వలస కూలీలకు పంపిణీ చేశారు.
నెల్లూరు జిల్లాలో...