కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా లాక్డౌన్ కొనసాగుతున్నా.. అత్యవసరాల పరిధిలోకి వచ్చే పెట్రోల్ బంకులు 24 గంటలూ పనిచేస్తున్నాయి. బంకుల్లో పనిచేసే సిబ్బంది 3 షిఫ్టుల్లో విధులకు హాజరుకాక తప్పని పరిస్థితి. అనేక వాహనాల్లో పెట్రోల్ నింపుకునేందుకు బంకులకు వస్తుంటారు. అయితే వారిలో ఎవరికి ఏ లక్షణాలు ఉన్నాయో చెప్పలేని పరిస్థితి. ఈ క్రమంలో వినియోగదారుల నుంచి సిబ్బందికి, సిబ్బంది నుంచి వినియోగదారుల రక్షణ కోసం విజయవాడ నగరంలో పోలీసుల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు సిబ్బందికి రక్షణ కిట్లు అందించారు. తల నుంచి కాళ్ల వరకు శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా రూపొందించిన ఈ కిట్ ధరించి.. విధులు నిర్వహిస్తున్నారు. నగరంలో రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో భయం భయంగా విధులు నిర్వర్తించాల్సి వస్తుందని.. ఈ కిట్లు ధరించి ధైర్యంగా డ్యూటీ చేయగలుగుతున్నామని.. వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పెట్రోల్ బంకు సిబ్బందికి కోరనా రక్షణ కిట్లు పంపిణీ - విజయవాడలో కరోనా వార్తలు
కరోనా ఎప్పుడు ఎవరి రూపంలో వస్తుందో తెలియదు. ఎవర్ని బలిచేస్తోందో అర్ధం కాదు. అందుకే పెట్రోల్ బంకులో పనిచేసే సిబ్బందికి కరోనా రక్షణ కిట్లను.. పోలీసులు అందించారు.
Distribution of Corona Protection Kits to Petrol Bunk Staff at vijayawada in kishna district