కృష్ణాజిల్లా అవనిగడ్డలో కోడూరు, ఘంటసాల మండలాలకు చెందిన 54 మంది లబ్ధిదారులకు రూ.13.16 లక్షల విలువగల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ఇప్పటి వరకు మూడు విడతలుగా జరిగిన కార్యక్రమాల్లో రూ.2 కోట్లు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే సింహాద్రి చెప్పారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ - ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ
అవనిగడ్డలో కోడూరు, ఘంటసాల మండలాలకు 54 మంది లబ్ధిదారులకు రూ.13.16 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే సింహాద్రి పంపిణీ చేశారు.
![ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ Distribution of Chief Minister's Assistance Fund checks](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8065013-46-8065013-1595048025654.jpg)
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ
కోవిడ్ పరీక్షలు నిర్వహణ, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న చర్యలు దేశానికి ఆదర్శం అన్నారు. ఇలాంటి సీఎం కావాలని...దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు లబ్ధిదారులు పాల్గొన్నారు.