విజయవాడలో లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు పలువురు దాతలు భోజనం పంపిణీ చేశారు. నగరంలోని న్యూ ఆర్టీసీ కాలనీ, అయప్పనగర్ కాలనీ, ఆటో నగర్ 100 అడుగుల రోడ్డు, సన్లైట్ సెంటర్, సాయి హోటల్ సెంటర్లో ఉన్న పేదలకు ఆహారం అందించారు. అమృత కేటరింగ్, యోగా మిత్రబృందం, వాకర్స్ అసోసియేషన్ ఆఫ్ పటమట హైస్కూల్ తదితర స్వచ్చంధ సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
విజయవాడలో పేదలకు ఆహారం పంపిణీ - విజయవాడలో లాక్డౌన్ ప్రభావం
రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ నిబంధన కట్టుదిట్టంగా కొనసాగుతోంది. ఈ నిబంధన కారణంగా ఉపాధి కోల్పోయిన వలసకూలీలు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థలను గమనించి కొందరు దాతలు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. వారికి తోచినంత తోడ్పాటును అందిస్తూ బాసటగా నిలుస్తున్నారు.
విజయవాడలో పేదలకు ఆహారం పంపిణీ