కృష్ణా జిల్లా గన్నవరంలో వైకాపా వర్గీయుల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. బాపులపాడు మండలం కాకులపాడులో గ్రామ సచివాలయం శంకుస్థాపనకు ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వచ్చారు. అయితే... ఎమ్మెల్యే, దుట్టా వర్గాలు శంకుస్థాపన తాము చేస్తామంటే.. తాము చేస్తామంటూ వాదనకు దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాలకు చెందిన వైకాపా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చింపివేశారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టగా.. ఎమ్మెల్యే చొరవతో తిరిగి గ్రామంలో సమావేశం నిర్వహించారు.
కృష్ణా జిల్లా గన్నవరం వైకాపాలో వర్గ విభేదాలు - Disputes in Gannavaram
కృష్ణా జిల్లా గన్నవరం వైకాపాలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. స్థానిక ఎమ్మెల్యే వైకాపాకు మద్దతు ప్రకటించినప్పటి నుంచి... ఎప్పటినుంచో వైకాపాలో ఉన్న వర్గంతో విభేదాలు తలెత్తుతున్నాయి. తాజాగా కాకులపాడులో గ్రామ సచివాలయానికి శంకుస్థాపన విషయంలో మరోసారి వివాదం తలెత్తింది.
disputes-in-gannavaram-ycp