ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అవసరమైతే బల నిరూపణకు మేము సిద్ధం' - ఈరోజు విజయవాడలో ఏపీ వీఆర్వో సంఘం సభ్యులు తాజా వార్తలు

ఏపీ వీఆర్వో సంఘం సభ్యుల మధ్య వివాదం చినికి చినికి గాలివాన అవుతోంది. ఎవరికి వారు.. తమ సంఘానికే గుర్తింపు, మెజారిటీ బలం ఉందని ప్రకటనలు చేస్తున్నారు. అవసరమైతే బల నిరూపణకు మేము సిద్దంగా ఉన్నామని సవాళ్లు విసురుకుంటున్నారు.

AP VRO community members
ఏపీ విఆర్వో సంఘం అధ్యక్షులు రవీంద్ర రాజు

By

Published : Mar 22, 2021, 7:32 PM IST

రాష్ట్ర వీఆర్వో సంఘం సభ్యుల మధ్య వివాదం రోజు రోజుకూ పెరుగుతోంది. ఎవరికి వారే.. తమ సంఘానికే గుర్తింపు, మెజారిటీ బలం ఉందని ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘం మద్దతు ఇస్తున్న ఏపీ వీఆర్వో సంఘం అధ్యక్షులు రవీంద్ర రాజు.. మార్చి 4న 13 జిల్లాల నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శుల సమావేశంలో తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని తెలిపారు.

మాజీ అధ్యక్షులు ఆంజనేయులు సంఘానికి నేడు గుర్తింపు లేదని తేల్చి చెప్పారు. బొప్పరాజుతో చేతులు కలిపిన ఆంజనేయులు వీఆర్వోలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్వోల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని.. గ్రామ స్థాయిలో వారు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వానికి వివరిస్తామని ఆయన చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details