కృష్ణా జిల్లాలో దిశ పెట్రోలింగ్ బృందాలు మహిళలకు భద్రత, రక్షణ విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆపదలో సమయంలో " దిశ యాప్ "ను ఏవిధంగా వినియోగించుకొవచ్చో వివరించారు. మహిళల భద్రత, రక్షణ కోసం ఎస్పీ రవీంద్రనాథ్ బాబు జిల్లాలోని పోలీస్ స్టేషన్లకు 40 దిశ పెట్రోలింగ్ ద్విచక్ర వాహనాలను కేటాయించారు. ఈ వాహనాల ద్వారా నిర్ధేశిత ప్రాంతాలకు వెళ్లి మహిళలతో మాట్లాడి వారికేమైనా సమస్యలు ఉంటే తమకు తెలియజేయాలని సూచిస్తున్నారు. విద్యా సంస్థలు, మార్కెట్ స్థలాలు, మహిళా హాస్టళ్లు, తదితర ప్రాంతాలకు వెళ్లి మహిళల భద్రత గురించి వారికి అవగాహన కల్పిస్తున్నారు.
మహిళలకు భద్రతపై 'దిశ' బృందాల అవగాహన - కృష్ణా జిల్లా తాజా వార్తలు
భద్రతా విషయాలపై 'దిశ' పెట్రోలింగ్ బృందాలు మహిళలకు చైతన్యం కల్పిస్తున్నాయి. ఆపదలో ఉన్నప్పుడు " దిశ యాప్ " ద్వారా ఏ విధంగా రక్షణ పొందాలో వివరిస్తున్నారు.
దిశ పెట్రోలింగ్ బృందాలు