సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్రవ్యాప్తంగా పేదలు, ఉద్యోగులు, హైకోర్టు న్యాయవాదులు, విలేకరుల ఇళ్ల స్థలాల పంపిణీపై మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, బొత్స, బుగ్గన, విశ్వరూప్ చర్చించారు. ఈ సందర్భంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.... పురోహితులు, ఇమాంలు, పాస్టర్లకు ఇళ్ల స్థలాలపై ప్రాథమిక భేటీలో చర్చించినట్లు తెలిపారు. గతంలో ఐఏఎస్‌లకు ఇళ్ల స్థలాలు ఇచ్చారన్న ఆయన... మిగతా వర్గాలు ఎందరు ఉన్నారనే అంశంపై వివరాలు సేకరించామన్నారు. అర్హులైన వాళ్లు ఇల్లు లేదా ఇంటి స్థలం లేకుండా ఉండేందుకు వీల్లేదన్నారు. ఇందుకు సంబంధించి ఆర్టీజీఎస్ వివరాలు సేకరిస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా భూ సర్వే చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీసర్వే చేపట్టాలని చూస్తున్నట్లు వివరించారు.
'అర్హులైన వారందరికీ ఇల్లు లేదా ఇంటి స్థలం' - కొత్తగా ఇవ్వనున్న స్థలాలపై ... మంత్రివర్గ ఉపసంఘంలో చర్చలు
రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. పురోహితులు, ఇమాంలు, పాస్టర్లకు ఇళ్ల స్థలాలపై ప్రాథమిక భేటీలో చర్చించారు.
కొత్తగా ఇవ్వనున్న స్థలాలపై ... మంత్రివర్గ ఉపసంఘంలో చర్చలు