ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అదనపు వ్యయం వసూలుకు అనుమతించండి' - ఏపీ డిస్కంల విద్యుత్ బిల్లులు

వినియోగదారుల నుంచి అనదపు వ్యయం వసూలుకు అనుమతించండి అంటూ ఏపీఈఆర్‌సీకి డిస్కంలు ప్రతిపాదన పంపించాయి. ట్రూఅప్‌ కింద రూ.2,542.86 కోట్లను వసూలు చేసేలా అంచనా వేసుకుంది. కాగా.. ఈనెల 30న విచారణ తరువాత ఏపీఈఆర్‌సీ నిర్ణయాన్ని తెలపనుంది.

discoms proposals  of true up charges to aperc
డిస్కం

By

Published : Jun 28, 2021, 7:52 AM IST

డిస్కంలు 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ట్రూఅప్‌ కింద రూ.2,542.86 కోట్లను వినియోగదారుల నుంచి వసూలు చేయడానికి అనుమతించాలని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)ని కోరాయి. ఈ నెల 30న ట్రూఅప్‌ ప్రతిపాదనలపై ఏపీఈఆర్‌సీ విచారించనుంది. తూర్పు విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌) రూ.701.28 కోట్లు, దక్షిణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్‌) 1,841.58 కోట్లను ట్రూఅప్‌ కింద ప్రతిపాదించాయి. ఈ ప్రతిపాదనలపై విచారణ తర్వాత ఎంత మొత్తాన్ని అనుమతించాలనే దానిపై ఏపీఈఆర్‌సీ నిర్ణయిస్తుంది.

ఏమిటీ ట్రూ అప్‌?
డిస్కంలు సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్‌) ఆధారంగా టారిఫ్‌ ఆర్డర్‌ను ఏపీఈఆర్‌సీ రూపొందిస్తుంది. దీనికి లోబడి డిస్కంలు విద్యుత్‌ కొనుగోలు, అమ్మకాలు చేయాలి. అంతకుమించి చేసిన ఖర్చుకు కారణాలు చూపి ప్రజల నుంచి ఏటా ట్రూఅప్‌ పేరిట డిస్కంలు వసూలుచేస్తాయి. ట్రూఅప్‌లో చూపినట్లు జెన్‌కో ప్లాంట్ల నుంచి విద్యుత్‌ అందుబాటులో లేని కారణంగా బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వచ్చింది. టారిఫ్‌ ఆర్డర్‌ ప్రకారం యూనిట్‌ సగటు ధర రూ.2.97 వంతున అనుమతిస్తే.. తీసుకున్న విద్యుత్‌కు సగటున రూ.3.33 వంతున ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సి వచ్చిందని ఎస్‌పీడీసీఎల్‌ పేర్కొంది. రూ.2.92 వంతున ఏపీఈఆర్‌సీ అనుమతిస్తే.. వాస్తవానికి యూనిట్‌కు సగటున రూ.3.42 వంతున చెల్లించామని ఈపీడీసీఎల్‌ నివేదికలో పేర్కొంది. దీనివల్ల చర వ్యయం అనుమతించిన దానికంటే రూ.1,558.77 కోట్లు పెరిగిందని డిస్కంలు పేర్కొన్నాయి. అలాగే రెవెన్యూ ట్రూఅప్‌ కింద రూ.711.64 కోట్లను డిస్కంలు చూపాయి.

  • ఏపీపీడీసీఎల్‌ నుంచి 2019-20లో 10489 ఎం.యూ.ల విద్యుత్‌ తీసుకోటానికి ఏపీఈఆర్‌సీ టారిఫ్‌ ఆర్డర్‌లో అనుమతిస్తే.. 3,840.77 ఎం.యూల విద్యుత్‌ను డిస్కంలు తీసుకోలేదు. బహిరంగ మార్కెట్‌ నుంచి అదే సంవత్సరంలో 3,773.97 ఎంయూల విద్యుత్‌ను రూ.1,498.71 కోట్లతో డిస్కంలు కొన్నాయి.
  • కృష్ణపట్నం నుంచి యూనిట్‌కు రూ.3.07 వంతున వచ్చే విద్యుత్‌ను డిస్కంలు తీసుకుని ఉంటే రూ.1,158.60 కోట్లు వెచ్చిస్తే సరిపోయేది. బహిరంగ మార్కెట్‌లో కొనడంతో అదనంగా రూ.340.11 కోట్ల భారాన్ని డిస్కంలు ప్రజలపై మోపనున్నాయి.
  • కృష్ణపట్నం ప్లాంటులో బొగ్గు నిల్వలు లేని కారణంగా పూర్తిస్థాయిలో ఉత్పత్తి అందుబాటులో లేకపోవటం వల్లనే బహిరంగ మార్కెట్లో కొన్నట్లు డిస్కంలు పేర్కొన్నాయి. కానీ, 2019-20 టారిఫ్‌ అర్డర్‌లో కృష్ణపట్నం ప్లాంటుకు స్థిరఛార్జీల కింద రూ.1,069.88 కోట్లను ఏపీఈఆర్‌సీ అనుమతించింది. డిస్కంలు రూ.965.68 కోట్లను చెల్లించాయి. సుమారు 90% స్థిరఛార్జీలను డిస్కంలు చెల్లించాయి. పీపీఏ నిబంధన ప్రకారం ఉత్పత్తికి సన్నద్ధంగా లేకుంటే స్థిరఛార్జీలు చెల్లించక్కర్లేదు. దీని ప్రకారం చూస్తే ప్లాంటులో అందుబాటులో ఉన్నా.. డిస్కంలు బహిరంగ మార్కెట్‌ నుంచి కొన్నట్లు తేలిందని విద్యుత్‌రంగ నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చూడండి.

తెలంగాణ: తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రాయలసీమకు అన్యాయం చేస్తున్నాయి

ABOUT THE AUTHOR

...view details