ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కోర్టులు తప్పు పట్టినా నిర్ణయాలు మార్చకోవడం లేదు'

ఆంధ్రప్రదేశ్‌లో జగన్​హన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న విధాన నిర్ణయాలనూ, జీవోలను న్యాయస్థానాలు తప్పుబట్టడం, కోర్టులు వాటిని రద్దు చేయడమూ వరుసగా జరుగుతున్నా నిర్ణయాలు మార్చుకోవడం లేదని భాజపా అధికార ప్రతినిధి కీలారు దిలీప్ విమర్శించారు.

Dilip is the  of Bjp,  is furious over government decisions
మాట్లాడుతున్న కీలారు దిలీప్

By

Published : May 25, 2020, 1:11 PM IST

ఏపీలో జగన్​హన్​రెడ్డి ప్రభుత్వం ఒకపక్క కూల్చివేతల పర్వం కొనసాగిస్తూనే మరోవైపు అమ్మకాల ప్రక్రియ కూడా మొదలుపెట్టిందని భాజపా అధికార ప్రతినిధి కీలారు దిలీప్ అన్నారు. బిల్డ్ ఏపీ పేరుతో ఆంధ్రాలో ప్రభుత్వానికి చెందిన మార్కెట్లు, ఉద్యోగుల క్వార్టర్లను అమ్మేయడానికి వేలం పాటలు ప్రారంభించబోతున్న ఏపీ సర్కార్... ఇప్పుడు.. తిరుమల శ్రీవారి ఆస్తులనూ అమ్మకానికి పెట్టిందని ఆయన విమర్శించారు. ఇప్పటి వరకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 60కి పైగా సందర్భాలలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తప్పు పట్టిందని తెలిపారు. హైకోర్టు తప్పు పట్టిన తీర్పులను సుప్రీంకోర్టులో సవాల్‌ చేసినా, ఉపశమనం లభించక పోయినా ప్రభుత్వం దాన్ని తప్పుగా గుర్తించకపోవడం విచారకరం అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు పూసే విషయంలో పాలకులు ఇలా కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేయడంతో... ఆ జీవోను కొట్టివేయడంతో పాటు, కోర్టు ధిక్కరణ ప్రక్రియ గురించి కూడా న్యాయస్థానం మాట్లాడాల్సి వచ్చిందన్నారు. సర్కార్​కు వ్యతిరేకంగా ఏం జరిగినా. చంద్రబాబే చేయించారని.. ఆరోపణలు చేయడము, వైకాపా నేతలైతే ఇప్పుడు ఏకంగా న్యాయవ్యవస్థపైన... చంద్రబాబు ముద్ర వేసేందుకు ప్రయత్నించడమే... రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోందని ఆయన విమర్శించారు.

ఇదీ చూడండి:దుప్పిని చంపిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details