కృష్ణా జిల్లా వీరులపాడు మండలం గూడెం మాధవరం శివార్లలోని రహదారిలో ఎన్ఎస్పీ కాలువపై నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు వంతెన కింద ఉన్న రాతి గోడ కూలి.. రాకపోకలకు ఆటంకం ఏర్పడిందని స్థానికులు వాపోయారు. వెంటనే వంతెనకు మరమ్మతులు నిర్వహించాలని ప్రజలు కోరారు. ఈ రహదారి మీదుగా వీరులపాడు, జి. కొండూరు మండల్లాలోని కొన్ని గ్రామాలు, తెలంగాణలోని ఎర్రుపాలెం మండలంలోని గ్రామాల వారు రాకపోకలు సాగిస్తుంటారు.
కుంగిన వంతెన.. రాకపోకలకు ఆటంకం - గూడెంమాధవరంలో కుంగిన వంతెన వార్తలు
కృష్ణా జిల్లా గూడెం మాధవరం శివార్లలోని రహదారిలో ఉన్న వంతెన శిథిలావస్థకు చేరుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు వంతెన కింద ఉన్న రాతి గోడ కూలి..రాకపోకలకు అంతరాయం కలుగుతుందని స్థానికులు వాపోయారు. వెంటనే మరమ్మత్తులు చేయాలని కోరారు.

కుంగిన వంతెన