అమరావతి కోసం పటమట వాసులు ఏం చేశారో తెలుసా? - patamata different support for amaravathi news
రాష్ట్రానికి మూడు రాజధానుల ఏర్పాటును ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. రైతుల ఉద్యమానికి సంఘీభావంగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో.. పోలీసులు అరెస్టు చేస్తుండడంపై వినూత్నంగా తమ నిరసన తెలుపుతున్నారు. విజయవాడ పటమట ఫన్ టైమ్స్ ప్రాంత ప్రజలు.. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ప్రతి ఇంటి గేటుకు బోర్డులు పెట్టి తమ మద్దతు తెలుపుతున్నారు.