అమరావతి కోసం గులాబీలు పంచిపెట్టిన టీఎన్ఎస్ఎఫ్..! - అమరావతి కోసం వినూత్న నిరసన
అమరావతి కోసం తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ నడుం బిగించింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట గట్టు భీమవరం టోల్ గేట్ వద్ద టీఎన్ఎస్ఎఫ్ శాంతియుత పోరాటం చెసింది. హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి వస్తున్న వారికి గులాబీ పూలు అందించి, అమరావతికి సంఘీభావం తెలపాలని అభ్యర్థించారు. ఈ నిరసన కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మంచౌదరి, మండల నాయకులు పాల్గొన్నారు.
అమరావతి కోసం గులాబీలు పంచిపెట్టిన టీఎన్ఎస్ఎఫ్..!