విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శన వేళల్లో స్వల్ప మార్పులు చేశారు. ఇవాళ్టి నుంచి ఉదయం ఆరున్నర నుంచి పదకొండున్నర వరకూ భక్తులను అనుమతిస్తున్నట్టు పాలకమండలి ఛైర్మన్ సోమినాయుడు, ఈవో భ్రమరాంబ తెలిపారు. ఇప్పటివరకూ పదకొండు వరకే ఉన్న గడువును మరో అరగంట పొడిగించారు.
ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శన వేళల్లో మార్పులు - special poojas in vijayawada kanakadurga temple
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శన వేళల్లో స్వల్ప మార్పులు చేశారు. ఇవాళ్టి నుంచి ఉదయం ఆరున్నర గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్నందున లోకకళ్యాణార్ధం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శన వేళల్లో మార్పులు
దేవస్థానంలో నిర్వహించే పరోక్ష ఆర్జిత టిక్కెట్లు ఆన్‌లైన్‌లో తీసుకుని పూజలు చేయించుకునే అవకాశం వినియోగించుకోవాలని సూచించారు. లోకకల్యాణార్థం ప్రస్తుతం దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి లక్ష కుంకుమార్చన సేవ, మృత్యంజయ హోమం, గణపతి హోమం, రాహు-కేతు పూజలు ఏకాంతంగా చేశారు.
ఇదీ చదవండి: