కృష్ణాజిల్లా మొవ్వ మండలం వేములమడ గ్రామంలో ఆయకట్టు రైతులు వేసిన వరినాట్లు నీరులేక ఎండిపోతున్నాయి. దీంతో ఆయకట్టుకు వచ్చే కాల్వకు నీరు వదలాలని రైతులు వామపక్ష నాయకులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. ఓకానొకదశలో పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని మురాల నాంచారయ్య అనే రైతు అధికారులను హెచ్చరించాడు. నీటిపారుదల శాఖ అధికారులు రైతులతో చర్చలు జరిపి కాలువకు నీటి విడుదలకు ఒప్పుకోవడంతో ఆందోళన విరమించారు.
లంకలో వరద..సాగునీటి కోసం వ్యధ? - farmers darna
కృష్ణానది పొంగి లంక గ్రామాల్లో పంటలు మునిగిపోగా...మరొపక్క సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కి రాస్తా రోకో చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. సాగుకు నీరివ్వండంటూ రైతులు ఆత్మహత్యకు సైతం వెనకడాకపోవడం ఆలోచింప చేసే విషయం.
లంకలో వరద..సాగునీటి కోసం వ్యధ?