తిరుమలలో అన్యమత ప్రచారంపై విజయవాడలో భాజపా ధర్నాకు దిగింది.భాజపా హిందూ ధార్మిక ఆధ్వర్యంలో జరిగన ఈ నిరసన కార్యక్రమంలో తిరుపతిలో వెలుగు చూసిన అన్యమత ప్రచారంపై ఆందోళన వ్యక్తం చేశారు.బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచార ప్రకటనలను ఖండిస్తున్నట్లు,భాజపా ధార్మిక సెల్ అధ్యక్షులు చైతన్య శర్మ పేర్కొన్నారు.గోశాలలో గోవులు చనిపోతే కనీసం పశుసంవర్ధక శాఖ మంత్రికి అక్కడికి వెళ్లేందుకు సమయం లేకుండా పోయిందని ఆరోపించారు.గోవుల మృతిపై సిట్ వేసి14రోజులు గడుస్తున్నా ఇప్పటిదాకా నివేదిక ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
'అన్యమత ప్రచారం' వ్యతిరేకిస్తూ విజయవాడలో భాజపా ధర్నా - తిరుమల అన్యమత
తిరుమల బస్సు టికెట్లపై అన్యమత యాత్రల ప్రకటనలు రాజకీయ దుమారం రేపుతోంది. విజయవాడ ధర్నాచౌక్లో భాజపా హిందూ ధార్మిక సెల్ ఆధ్వర్యంలో భారీ ధర్నాకు దిగారు.
ధర్నాచేస్తున్న భాజపా నాయకులు