ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా అంతమవ్వాలని కోరుతూ... ధన్వంతరి మహా మృత్యుంజయ హోమం - శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం తాజావార్తలు

కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ధన్వంతరి మహా మృత్యుంజయ హోమం నిర్వహించారు. కరోనా మహమ్మారి తొలగిపోయి, ప్రజలు సంతోషంగా ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తూ ఈ హోమం జరిపించినట్లు ఆలయాధికారులు తెలిపారు.

Dhanvantari Maha Mrityunjaya Homam
ధన్వంతరి మహా మృత్యుంజయ హోమం

By

Published : May 31, 2021, 8:38 AM IST

కృష్ణా జిల్లా మోపిదేవిలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ధన్వంతరి మహా మృత్యుంజయ హోమం జరిపించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారుల ఆదేశం మేరకు చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల సహాయ కమిషనర్ జీవీడీఎన్ లీలాకుమార్ పర్యవేక్షణలో అత్యంత వైభవోపేతంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ దేశాలను అల్లాడిస్తున్న కరోనా అంతమవ్వాలని ప్రార్థిస్తూ ఈ హోమం నిర్వహించినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు.

కొవిడ్​ బారిన పడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినట్లు చెప్పారు. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ.. నిర్వహించిన మహా మృత్యుంజయ హోమం ఆన్​లైన్​ ద్వారా వీక్షించే ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. యూట్యూబ్​ లింకు ద్వారా ప్రపంచం నలుమూలల నుంచి సుమారు వెయ్యికి పైగా భక్తులు హోమంలో పాల్గొని, స్వామి వారి దీవెనలు పొందారని ఆలయాధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details