ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శత వసంతాల రామమందిరంలో.. ధనుర్మాస ఉత్సవాలు - కృష్ణా జిల్లాలో ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం

కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలోని శత వసంతాలు నిండిన శ్రీరామ మందిరంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

Dhanurmasa celebrations begin in rama mandiram in krishna district
శత వసంతాల రామమందిరంలో.. ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం

By

Published : Dec 17, 2019, 4:30 PM IST

శత వసంతాల రామమందిరంలో.. ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం

కృష్ణా జిల్లా నూజివీడు శ్రీ సూరి సీతారామ మందిరంలో మార్గశిర ధనుర్మాస ఉత్సవాలను వైభవోపేతంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ మద్రరామాయణ సప్తాహాలను భక్తులకు వీనులవిందుగా వినిపించారు. శతవసంతాల వార్షికోత్సవాన్ని పూర్తిచేసుకున్న సీతారామ మందిరం ద్వారా సాక్షాత్తూ శ్రీ రామచంద్రమూర్తి భక్తులను ఆశీర్వదిస్తున్నన్నారని ప్రసిద్ధ కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత వాడ్రేవు చిన వీరభద్రుడు తెలిపారు. ఆలయంలోకి ప్రవేశించగానే ఆధ్యాత్మిక శోభతో పాటు అనిర్వచనీయమైన అనుభూతి కలగుతోందని చెప్పారు.

ఏళ్లనాటి చరిత్ర....

19వ శతాబ్దం ప్రారంభంలో శ్రీ సూరి వారి వంశీయులు ఈ ఆలయాన్ని నిర్మించారు. శ్రీ సీతారామచంద్రమూర్తి కళ్యాణం క్రమం తప్పకుండా నిర్వహిస్తూ భక్తులకు ఆశీర్వచనాలు అందించడం ఆనవాయితీగా మారింది. నూజివీడు సంస్థానాధీశుల సహాయ సహకారాలను పొందిన తర్వాత ఈ ఆలయం మరింత అభివృద్ధిని, ప్రాశస్త్యాన్ని పొందింది. విలువైన, ఆధ్యాత్మిక విషయాలను పవిత్రమైన గ్రంధాలుగా మలచి.. గ్రంథాలయంలో ఉంచటమే ఇక్కడి మరో ప్రత్యేకత.

సూరి వంశీయులైన ఆచార్య రామ సూరి మాట్లాడుతూ... 1914 వ సంవత్సరంలో తమ పూర్వీకులు ఈ రామ మందిరాన్ని ఏర్పాటు చేయడం... ఎలమర్రు మీర్జాపురం జమీందార్లు సహాయ సహకారాలు పూర్తిస్థాయిలో అందించినట్లు తెలిపారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని ఈ సారీ వేడుకలను వైభవోపేతంగా కొనసాగిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ ధనుర్మాస ఉత్సవాలు డిసెంబరు 22వ తేదీ ఆదివారం వరకు కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని భక్తులు వివిధ హోదాల్లోని తెలుగు భాషా ప్రియులు హాజరయ్యారు.

ఇదీ చదవండి:

మహిళా కమిషన్ లోగో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details