విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరగుతున్న పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లను డీజీపీ గౌతమ్ సవాంగ్ పరిశీలించారు. ముఖ్యమంత్రి హాజరుకానున్న నేపథ్యంలో.. పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వీవీఐపీ, వీఐపీ లతో పాటు కొందరు సామాన్యులకు మాత్రమే వేడుకలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. వర్షం కురిసినా పరేడ్ కు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వేడుకలు నిర్వహించుకునేలా చర్యలు చేపడుతున్నట్లు డీజీపీ సవాంగ్ వెల్లడించారు.
DGP sawang: కరోనా నిబంధనలు పాటిస్తూ.. పంద్రాగస్టు వేడుకలు: డీజీపీ సవాంగ్
విజయవాడలోని పంద్రాగస్టు (august 15th) వేడుకల ఏర్పాట్లను డీజీపీ (DGP) పరిశీలించారు. ముఖ్యమంత్రి హాజరు దృష్ట్యా.. పటిష్ఠ భధ్రత చేపడుతున్నట్లు వెల్లడించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వేడుకలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
డీజీపీ గౌతమ్ సవాంగ్