తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి పదవీకాలం నేటితో పూర్తైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో ఉన్నతాధికారులు, సిబ్బంది ఆయనకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి.. మహేందర్‌రెడ్డి అత్యధిక కాలం డీజీపీగా పనిచేశారు. ఐపీఎస్‌గా 36 ఏళ్లపాటు సుదీర్ఘ సేవలందించారు. పోలీసు శాఖలో సాంకేతికతతో కూడిన విప్లవాత్మక మార్పులను డీజీపీ మహేందర్‌రెడ్డి తీసుకొచ్చారు.
తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి పదవీ విరమణ.. ఐపీఎస్‌గా 36ఏళ్లు సుదీర్ఘ సేవలు - DGP Mahender Reddy Farewell meeting
తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి పదవీకాలం ఈరోజుతో ముగిసింది. ఈ సందర్భంగా తెలంగాణ పోలీస్ అకాడమీలో మహేందర్‌రెడ్డికి పదవీ విరమణ కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
DGP Mahendar reddy
నూతన డీజీపీగా అంజనీ కుమార్ బాధ్యతల స్వీకరించారు. అంజనీకుమార్ గతంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, అవినీతి నిరోధక విభాగాధిపతిగా పనిచేశారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా.. లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగానూ అంజనీకుమార్ సేవలు అందించారు.
ఇవీ చదవండి: