ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 18, 2020, 9:23 PM IST

ETV Bharat / state

కరోనా నియంత్రణకు.. ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా పని చేశాం: డీజీపీ

రాష్ట్రంలో కరోనా నియంత్రణకు..ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా పని చేశామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మెడికల్‌ ఇంటెలిజెన్స్‌ను బలోపేతం చేయడంతోపాటు సమాచార సేకరణ, సత్వర స్పందనకు వీలుగా కొత్త వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ..కేంద్ర ఇంటలిజెన్స్‌ బ్యూరో విశ్రాంత ప్రత్యేక డైరెక్టర్ ప్రభాకర్‌ అలోక సూచించారు. సెంటర్‌ ఫర్‌ హ్యూమన్‌ సెక్యురిటీ స్టడీస్‌ ఆధ్వర్యంలో 'మహమ్మారి- జాతీయ భద్రతా సమస్యలు' అనే అంశంపై నిర్వహించిన సదస్సులో వీరు పాల్గొన్నారు.

dgp gowtham sawang
dgp gowtham sawang

కరోనా పాజిటివ్‌ కేసుల నిర్ధరణ, వారితో సంబంధం ఉన్న వారిని గుర్తించడంలో సాంకేతికత ఎంతో ఉపయోగపడిందని డీజీపీ గౌతం సవాంగ్‌ అన్నారు. రాష్ట్రంలో కరోనా అదుపులో ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా పని చేశామని చెప్పారు. సెంటర్‌ ఫర్‌ హ్యూమన్‌ సెక్యురిటీ స్టడీస్‌ ఆధ్వర్యంలో 'మహమ్మారి-జాతీయ భద్రతా సమస్యలు' అనే అంశంపై నిర్వహించిన వెబ్‌నార్‌ సదస్సులో డీజీపీ పాల్గొన్నారు.

లాక్‌డౌన్‌ ప్రారంభం నుంచి జూన్‌ 3 తేదీ వరకు 45 మంది పోలీసులకు కరోనా సోకినట్లు గుర్తించగా.. 44 మంది కోలుకుని క్షేమంగా బయటకు వచ్చారన్నారు. అన్‌లాక్‌ ప్రకటించిన నాటి నుంచి గడచిన 6 వారాల్లో 1,450 మందికి పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. మహమ్మారి వచ్చినప్పుడు భద్రతలో ఎలాంటి ప్రభావం ఉంటుందో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ అని తెలిపారు.

మహమ్మారి సమయంలో మెడికల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం పాత్ర కీలకమని.. సదస్సులో పాల్గొన్న కేంద్ర ఇంటలిజెన్స్‌ బ్యూరో విశ్రాంత ప్రత్యేక డైరెక్టర్ ప్రభాకర్‌ అలోక సూచించారు. అమెరికాతోపాటు వివిధ దేశాల్లో ఇలాంటి వ్యవస్థ ఉందో వివరించారు. ప్లేగు వంటి మహమ్మారుల సమయంలో ప్రపంచ వ్యాప్తంగా సామాజిక, ఆర్ధిక రంగాలపై తీవ్ర ప్రభావం పడిందని చెప్పారు. పర్యావరణంపై వాటి ప్రభావం ఉంటుందన్నారు. వీటన్నింటి నుంచి.. ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేయాలని అభిప్రాయపడ్డారు. మెడికల్‌ ఇంటెలిజెన్స్‌ను బలోపేతం చేయడంతోపాటు సమాచార సేకరణ, సత్వర స్పందనకు వీలుగా కొత్త వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తప్పుడు కథనాల నిరోధంతోపాటు వాటిపై ప్రత్యేక నిఘా అవసరమని చెప్పారు. మహమ్మారుల సమయంలో పోలీసుల భద్రత ఎంతో ముఖ్యమని సూచించారు.

ఇదీ చదవండి:దేశంలో కొత్తగా 34,884 కేసులు, 671 మరణాలు

ABOUT THE AUTHOR

...view details