రాష్ట్రంలో తప్పిపోయిన పిల్లలను గుర్తించి వారి తల్లితండ్రుల వద్దకు చేర్పించడం, అనాథలకు పునరావాసం కల్పించేందుకై పోలీసుశాఖ రెండు రోజులపాటు ఆపరేషన్ ముస్కాన్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఆపరేషన్ ముస్కాన్ పేరుతో పోలీసుశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, విద్యా, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, క్రీడా శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీలు తనిఖీలు నిర్వహించాయి. రాష్ట్రంలో తప్పిపోయిన చిన్నారులు, రాష్టంలో ఉన్న బాలబాలికల వివరాలను సేకరించి వారి ఫొటోలతో ఆల్బమ్ రూపొందిస్తారు. ఈ వివరాలతో ప్రత్యేక టీమ్‌లు రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, జనసామర్థ్యం కలిగిన జంక్షన్లు, చౌరస్తాలు, నిర్మాణ స్థలాలు, హోటళ్లు, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లను తనిఖీ చేస్తారు.
చిన్నారులు తల్లిదండ్రుల చెంతకు
ఇందులో భాగంగా ప్రతీ సబ్‌డివిజన్‌లో ఒక ఎస్సై, నలుగురు పోలీసు కానిస్టేబుళ్లు కలిగిన ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ప్రతీ బృందంలో మహిళా సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ బృందాలు సాధారణ దుస్తుల్లో వెళ్లి తనిఖీలు నిర్వహిస్తారు. తనిఖీల్లో గుర్తించిన పిల్లల సమాచారాన్ని ఛైల్డ్ ట్రాక్ పోర్టల్‌లో ఉంచుతారు. ఆపరేషన్ ముస్కాన్‌లో గుర్తించిన చిన్నారులను 24 గంటలలోపు ఆయా జిల్లాల్లోని ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీలకు అప్పగిస్తారు. ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీల ద్వారా దొరికిన పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తారు. సరైన చిరునామా దొరకని పిల్లలను షెల్టర్ హోంలలో ఉంచుతారు. రెండు రోజుల పాటు నిర్వహించే... ఈ ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో సంబంధిత విభాగాలైన షెల్టర్ హోమ్‌లు, స్వచ్ఛంద సంస్థలు, డి.సి.ఆర్.బి, ఛైల్డ్ హెల్ప్ లైన్, ఛైల్డ్ వెల్ఫేర్ అధికారులు, జువెనైల్ జస్టిస్ బోర్డ్, ఐ.సి.డి.ఎస్, ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీలు పాల్గొనటంతో పాటు తమ దగ్గర ఉన్న సమాచారాన్ని అందరికీ అందించి పిల్లలను గుర్తించేందుకు కృషిచేస్తారు.
పోర్టల్‌లో వివరాలు నమోదు