మోసం, ఫోర్జరీ, ఆధారాల ట్యాంపరింగ్ ద్వారా నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో.. తనను అక్రమంగా ఇరికించేందుకు ప్రయత్నించిన వారిపై సీబీఐ విచారణ జరిపించాలని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు.
వారంతా ఇందులో భాగస్వాములే..
ఈ నేరంలో డీజీపీ, సీఐడీ అదనపు డీజీ, ఏసీబీ డీజీ, నిఘా విభాగం అధికారులతో పాటు మరికొందరు భాగస్వాములయ్యారన్నారు. ఆయా అధికారులను వారు ప్రస్తుతమున్న స్థానాల్లోనే కొనసాగిస్తే ఈ కేసు స్వేచ్ఛాయుత, సకాల దర్యాప్తునకు విఘాతం కలుగుతుందన్నారు. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
'అందుకే సీబీఐకి'
డీజీపీ లేఖ ఆధారంగా తనను సస్పెండ్ చేస్తూ.. అక్రమ ఉత్తర్వులు జారీ చేసిన ప్రవీణ్ ప్రకాశ్, అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిలపైనా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్నారు.