జైళ్ల శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని జిల్లా జైలు వద్ద పెట్రోలు బంకును ఆ శాఖ డీజీ హసన్ రేజా ప్రారంభించారు. జైలులో శిక్ష అనుభవించి విడుదలైన ఖైదీలను ఉద్యోగులగా నియమించినట్లు డీజీ తెలిపారు. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మళ్లీ నేరాల వైపు వెళ్లకుండా వారిలో పరివర్తన వస్తుందన్నారు. ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్న ఖైదీల కుటుంబాలకు సైతం ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. బంకు నిర్వహణలో వచ్చిన ఆదాయాన్ని జైళ్ల శాఖ సంక్షేమానికి వినియోగించనున్నట్లు హసన్ రేజా తెలియజేశారు.
జైళ్ల శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్.. ప్రారంభించిన డీజీ - pentrol bunk under prisons department news update
ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మళ్లీ నేరాల వైపు వెళ్లకుండా పరివర్తన వస్తుందని జైళ్లశాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆ శాఖ డీజీ హసన్ రేజా తెలిపారు. విజయవాడలోని జిల్లా జైలు వద్ద ఆయన పెట్రోల్ బంకును ప్రారంభించారు.
జైలు శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్
TAGGED:
జైళ్ల శాఖ తాజా వార్తలు