Garnishing Durgamma With Bangles: కార్తీక మాసం విదియను పురస్కరించుకుని రేపు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను గాజులతో అలంకరించనున్నారు. అమ్మవారి మూల విరాట్‌తో పాటు ఉత్సవమూర్తిని గాజులతో సుందరంగా తీర్చిదిద్దబోతున్నారు. అంతరాలయంతో పాటు అమ్మవారి ప్రాంగణాన్ని గాజుల దండలతో అలంకరించారు.
కార్తీక మాసం.. రేపు దుర్గమ్మను గాజులతో అలంకరించనున్న భక్తులు - ap news updates
Garnishing Durgamma With Bangles: కార్తీక మాసం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. కార్తీక మాసం సందర్భంగా.. ప్రతి సంవత్సరం అమ్మవారికి గాజులు అలంకరించడం ఆచారం కాబట్టి.. రేపు తెల్లవారుజాము నుంచి దుర్గాదేవికి గాజులు అలంకరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రానున్నారని ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు.
కార్తీక మాసం
యమ ద్వితీయను పురస్కరించుకుని ప్రతి ఏటా కార్తీక మాసం రెండో రోజున అమ్మవారి సన్నిధిలో గాజుల మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. గాజుల అలంకరణలో అమ్మవారు ఉదయం నాలుగు గంటల నుంచి భక్తులకు దర్శనమివ్వనున్నారు. దాతల నుంచి విరాళం రూపంలో గాజులను సేకరించామని.. ఉత్సవం ముగిసిన అనంతరం అమ్మవారికి అలంకరించిన గాజులను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తామని ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు.