కృష్ణా జిల్లా దివిసీమలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పెదకళ్ళేపల్లి గ్రామంలో శ్రీదుర్గానాగేశ్వర స్వామి, ఘంటసాల గ్రామంలో జలదీశ్వరస్వామి ఆలయం, మోపిదేవి గ్రామంలో శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం, సంగమేశ్వరం గ్రామంలోని సంగమేశ్వరస్వామి, నడకుదురు గ్రామంలో పుద్వీశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీకమాసంలోని రెండో సోమవారాన్ని పురస్కరించుకొని భక్తులు కృష్ణానదిలో స్నానాలు ఆచరించి, స్వామివారికి అభిషేకాలు చేశారు.
దివిసీమలోని ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు - దివిసీమలో కార్తీకమాసం తాజా వార్తలు
కృష్ణా జిల్లా దివిసీమలో కార్తీకమాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకొని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి అభిషేకాలు చేశారు.

దివిసీమలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు