ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కార్తిక సోమవారం.. ఆలయాల్లో భక్తుల సందడి

కార్తిక మాసం నాలుగో సోమవాారాన్ని పురస్కరించుకొని పలు జిల్లాలోని శైవ క్షేత్రాల్లో భక్తుల సందడి నెలకొంది. పెద్ద సంఖ్యలో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి దర్శనంతో పాటు కార్తిక దీపాలను వెలిగించారు.

ఆలయాల్లో దీపాలు వెలిగిస్తున్న మహిళలు

By

Published : Dec 7, 2020, 11:03 PM IST

Updated : Dec 8, 2020, 12:32 AM IST

కార్తిక సోమవారం సందర్భంగా ఆలయాల్లో భక్తుల సందడి
పవిత్ర కార్తిక మాసంలోని నాలుగో సోమవారాన్ని పురస్కరించుకొని గన్నవరం నియోజకవర్గంలో ముస్తాబాద్, కేసరపల్లి, వీరవల్లిలోని శివుని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లింగాకారంలో మహిళలు వెలిగించిన దీపాలంకరణ విశేషంగా ఆకట్టుకుంది. ఆ దేవదేవుడికి ఆలయ నిర్వహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రకాశం జిల్లాలో..

కార్తిక సోమవారం సందర్భంగా ప్రకాశం జిల్లా పుల్లల చెరువులోని బ్రహ్మం గారి దేవాలయ ప్రాంగణంలో కోటి దీపోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు.

అనంతపురం జిల్లాలో

కార్తిక మాసం నాలుగో సోమవారాన్ని పురస్కరించుకుని అనంతపురం జిల్లా కదిరి శివాలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆలయ ఆవరణలో మహిళలు దీపోత్సవం నిర్వహించుకునేందుకు వీలుగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు దేవదేవుడిని దర్శించుకోవడానికి ఆలయానికి తరలివచ్చారు. స్వామివారి దర్శనం తో పాటు దీపాలను వెలిగించారు. కార్తిక దీపోత్సవంతోపాటు, విద్యుత్ దీపాల అలంకరణతో శివాలయం ప్రత్యేక శోభను సంతరించుకుంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు

కర్నూలు జిల్లాలో

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని గుడెకల్ లో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తిక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఆలయం ఆవరణలో కార్తిక దీపాలు వెలిగించారు.

ఇదీ చదవండి

అంతుచిక్కని వ్యాధి...అంతకంతకూ పెరుగుతున్న ఆందోళన

Last Updated : Dec 8, 2020, 12:32 AM IST

ABOUT THE AUTHOR

...view details