తిరుపతమ్మ తల్లికి సారే సమర్పించిన భక్తులు - పెనుగంచిప్రోలు
కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారికి సారె సమర్పించారు. అమ్మవారికి కి పట్టు వస్త్రాలు, ఫలాలు, పిండి వంటలు తీసుకొచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారికి సారే బహూకరించారు. కృష్ణాజిల్లా నందిగామ వాసవి క్లబ్ మహిళల ఆధ్వర్యంలో శ్రీ తిరుపతమ్మ అమ్మవారికి... ఆషాఢమాసంలో ఆనవాయితీగా సమర్పించే సారె ను అందజేశారు. నందిగామ నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి... అమ్మవారికి కి పట్టు వస్త్రాలు, ఫలాలు, పిండి వంటలు తీసుకొచ్చారు. మేళతాళాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసారు. అనంతరం సారెను ఆలయ ప్రధాన అర్చకుడు మరిపోయిన వెంకటరమణ ఆలయ చైర్మన్ అత్తులూరి అచ్యుతరావు అందుకుని అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంతో ఆలయం వద్ద పెద్ద ఎత్తున కోలాహలం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.