విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై ఆషాడ సారె కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ఆషాడ మాసం సందర్భంగా అమ్మవారికి పవిత్ర సారె సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. చీరలు, పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, మిఠాయిలు ఇతర వస్తువులతో బృందాలుగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు.
DURGAMMA TEMPLE: కనకదుర్గమ్మ చెంతకు ఆషాడ సారె - విజయవాడ దుర్గగుడి వార్తలు
విడయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాడ సారె కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. చీరలు, పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, మిఠాయిలు ఇతర వస్తువులతో బృందాలుగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు.
మచిలీపట్నం భ్రమరాంబిక సేవా సమితి, మారుతి సువర్చల బృందం, కంకిపాడుకు రమాదేవి బృందం, సీతానగరం, గుడివాడ, తుళ్లూరు, ఉండవల్లి, నిడమానూరు, కానూరుతోపాటు విజయవాడ నగరానికి చెందిన పలు బృందాలు నేడు అమ్మవారికి సారె సమర్పించాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ పవిత్ర సారె సమర్పించే భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అమ్మవారికి సారె సమర్పించిన భక్త బృందానికి అమ్మవారి దర్శనం కల్పించిన అనంతరం మహామండపం ఆరో అంతస్తులో అమ్మవారి నామస్మరణతో పాటు పారాయణం చేశారు. సారె సమర్పించిన భక్తబృందాలతో ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు.
ఇదీ చదవండి