కృష్ణాజిల్లా మోపిదేవి మండలంలోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మార్గశిర షష్టి, ఆదివారం కావడంతో వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆలయం వద్ద కిలోమీటరు దూరం వరకు భక్తులు ఎండలో నిలబడి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలయాధికారులు కనీసం మంచినీరు కూడా ఏర్పాటు చేయకపోవడంతో తాగునీటి సమస్యను ఎదుర్కొన్నారు. వేల సంఖ్యలో భక్తులు వస్తారని ఆలయాధికారులకు తెలిసినా.. కనీస వసతులు కల్పించకపోవటంపై భక్తులు నిరాశకు లోనయ్యారు.
మోపిదేవి ఆలయంలో భక్తుల ఇక్కట్లు - krishna district latest news
మార్గశిర షష్టి సందర్భంగా.. కృష్ణాజిల్లా మోపిదేవి మండలంలోని శ్రీ వల్లీ దేవసేనా, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారని తెలిసినా.. ఆలయాధికారులు కనీస వసతులు కల్పించకపోవటంతో భక్తులు నిరాశకు గురయ్యారు.

మోపిదేవి ఆలయంలో భక్తుల ఇక్కట్లు
మోపిదేవి ఆలయంలో భక్తుల ఇక్కట్లు