ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నూజివీడు సరస్వతి అమ్మవారి ఆలయానికి తగ్గిన భక్తుల తాకిడి - నూజివీడు శ్రీ సరస్వతి ఆలయంలో తగ్గిన భక్తుల రద్దీ

రెండవ బాసరగా పేరు గాంచిన కృష్ణా జిల్లా నూజివీడు శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో భక్తుల తాకిడి గణనీయంగా తగ్గింది. ప్రతి సంవత్సరం దసరా వేడుకల్లో సరస్వతి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడేదని.. కరోనా కారణంగా ఈ సంవత్సరం ఆలయం వెలవెలబోతోందని స్థానికులు అంటున్నారు.

devotees are not coming to nuzivedu saraswathi temple due to corona pandamic
నూజివీడు శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో తగ్గిన భక్తుల తాకిడి

By

Published : Oct 20, 2020, 3:13 PM IST


రెండవ బాసరగా పేరుగాంచిన కృష్ణా జిల్లా నూజివీడు శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో ఏటా దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరిగేవి. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ఈ ఏడాది కరోనా కారణంగా భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది.

ప్రతి సంవత్సరం దసరా వేడుకల్లో సరస్వతి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడేదని స్థానికులు తెలిపారు. కొవిడ్ కారణంగా భక్తుల కోలాహలం పూర్తిగా తగ్గిందని వారు తెలిపారు. వచ్చే కొద్ది మంది భక్తులు సామాజిక దూరం పాటిస్తూనే మాస్కులు ధరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details