కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. ముఖ్యంగా ఆది, గురు వారాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. అయితే ప్రస్తుతం కొవిడ్ కారణంగా పదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు దాటిన వృద్ధులను ఈ ఆలయంలోకి అనుమతించడం లేదు.
మోపిదేవి ఆలయానికి ఎక్కువమంది భక్తులు తమ చిన్నారుల తలనీలాలు తీయించడం, అన్నప్రాసన, కుట్టుపోగులు వంటి మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు. ప్రస్తుతం చిన్నారులను ఆలయంలోకి అనుమతించకపోవటంతో వారు.. ఆలయానికి దగ్గరలోని నాగపుట్ట వద్దకు వెళ్తున్నారు. తమ పిల్లలకు అక్కడే తలనీలాలు సమర్పిస్తున్నారు.