కృష్ణా జిల్లా మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్‌పై మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. క్వారీల్లో గ్రావెల్ అక్రమంగా రవాణా జరిపిన విషయాన్ని ప్రశ్నిస్తుంటే.. తనపై కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షంగా తాము ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సింది పోయి... సవాళ్ళు విసురుతూ బూతులు మాట్లాడటం సమంజసం కాదని హితవు పలికారు.
వైకాపా హయాంలో ఎవరికి ఇళ్ళ పట్టాలు ఇచ్చారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సీబీఐ ఈడీ కేసుల్లో ఉన్న ఎమ్మెల్యే వసంత ఎస్టేట్స్ డైరెక్టర్ ఎవరో చెప్పాలన్నారు. శాసనసభ్యునిగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉందని స్పష్టం చేశారు.