కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో... కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను మాజీ మంత్రి దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరిశీలించారు. వర్షాల వల్ల చేతికొచ్చిన పంట దెబ్బతినటం దురదృష్టకరమని... రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీట మునగటం చాలా బాధాకరమని దేవినేని అన్నారు. మెట్ట ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున పంటలు నీట మునిగి రైతులు నష్టపోయారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: దేవినేని - పరిటాల గ్రామంలో నీటమునిగిన పంటలను పరిశీలించిన తెదేపా నేతలు
కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో... వర్షాల వల్ల నీటమునిగిన పంటలను తెదేపా నేత దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరిశీలించారు. వర్షాల వల్ల పంటలు మునిగిపోయి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: దేవినేని
ఇదీ చదవండి: