ఈవీఎం పని చేయకపోతే మరమ్మతులు చేయాలి లేదా కొత్తవి పెట్టాలని మంత్రి దేవినేని విజయవాడలో అన్నారు. మరమ్మతుల కోసం 6 గంటల సమయం తీసుకోవటం ఏంటని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో కొత్త ప్రధాని రావడం ఖాయమని జోస్యం చెప్పారు. దేశ రాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు జగన్ కోట్లు ఖర్చుపెట్టారని ఆరోపించారు. ప్రశాంతి కిషోర్, జగన్, విజయ సాయిరెడ్డి పాపాలు బయటకు వస్తాయన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని ప్రజలు పెద్దఎత్తున పోలింగ్‌లో పాల్గొన్నారని తెలిపారు. ఎన్నికలు పూర్తి కాగానే విచ్చలవిడిగా పందేలు కాశారని.. సంస్థల తరపున విశ్రాంత అధికారులను జగన్ పోలవరం పంపారని ఎద్దేవా చేశారు. పోలవరం డ్యామ్‌సైట్‌లో 45 నిమిషాలు కూడా లేకుండా వెళ్లారని విమర్శించారు. రాజమహేంద్రవరంలో సమావేశాలు పెట్టి పోలవరంలో సర్వం అవినీతి అని చెప్పారని.. ప్రభుత్వంపై అనవసరంగా బురద జల్లుతున్నారని మండిపడ్డారు.
'దేశ రాజకీయాల్లో చంద్రబాబుది కీలక పాత్ర' - ec
కేంద్రంలో కొత్త ప్రధాని రావటం ఖాయమని మంత్రి దేవినేని జోస్యం చెప్పారు. దేశ రాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు.
దేవినేని