కొండపల్లి క్వారీ వివాదంలో నమోదైన కేసులో 13 మంది నిందితుల ముందస్తు బెయిలు విషయంలో శుక్రవారం జి.కొండూరులో హైడ్రామా నడిచింది. ఉదయం నుంచి ఇదిగో అదిగో అంటూ చెప్పిన పోలీసులు చివరికి రాత్రి 9.30 గంటల తర్వాత హైకోర్టు ఆదేశాలను అమలు చేశారు. వివరాల్లోకి వెళితే... కొండపల్లి క్వారీ వివాదంలో నిందితులైన వారిలో 13 మందికి బుధవారం హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. ఆ పత్రాలతో శుక్రవారం ఉదయం 10 గంటలకు వారంతా జి.కొండూరు స్టేషన్‌కు వచ్చినా ఎస్సై ధర్మరాజు అందుబాటులో లేరు. ఆయనను సంప్రదిస్తున్న నాయకులకు ఇదిగో... వస్తున్నానంటూ సమాధానం చెబుతూనే ఉన్నారు. దాంతో మాజీ మంత్రి దేవినేని ఉమ సాయంత్రం 5 గంటల సమయంలో జి.కొండూరు చేరుకున్నారు. ఎస్సై అందుబాటులో లేకపోవడంతో పలుసార్లు ఫోన్లలో సంప్రదించారు.
Devineni uma bail: బెయిలు విషయంలో హైడ్రామా.. ఠాణాలో దేవినేని ఉమ నిరీక్షణ - kondapalli quari news
కృష్ణా జిల్లాలోని కొండపల్లిలో క్వారీ వివాదంలో తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేనితో పాటు పలువురిపై నమోదైన కేసులో బెయిలు విషయంలో హైడ్రామా నడిచింది. జి. కొండూరు స్టేషన్ బెయిల్ పత్రాలతో ఉమా సహా నాయకులు వచ్చినప్పటికీ.. ఎస్సై అందుబాటులో లేరు. రాత్రి 10.30 గంటల సమయంలో ఎస్సై రావడంతో పూచికత్తులు సమర్పించి వెనుదిరిగారు.
చివరికి రాత్రి 8 గంటల అనంతరం స్టేషన్‌కు వచ్చిన ఎస్‌ఐ... న్యాయవాది, స్థానిక నాయకులు ఉయ్యూరు నరసింహారావు తదితరులతో కొద్దిసేపు మాట్లాడారు. శనివారం మైలవరంలో ఎస్పీ కార్యక్రమం ఏర్పాట్లలో ఉన్నామంటూ మళ్లీ బయటకు వెళ్లిపోయారు. దాంతో అసహనానికి గురైన ఉమ.. కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా కావాలనే కాలయాపన చేయిస్తున్నారని, పూచీకత్తులు తీసుకునే వరకు ఇక్కడే ఉంటామని స్పష్టంచేశారు. అయితే.. అందరి నుంచి పూచీకత్తులు తీసుకున్నట్లు రాత్రి 9.30 గంటల సమయంలో ఎసై ధర్మరాజు తెలిపారు. అనంతరం స్టేషన్ సిబ్బంది ద్వారానే పూచీకత్తులు, ష్యూరిటీలు సమర్పించి, రాత్రి 10.30 గంటల అనంతరం ఉమాతోపాటు నాయకులు వెళ్లిపోయారు.
ఇదీ చదవండి:PROPERTY TAX: విజయవాడలో ఆస్తి పన్ను సవరిస్తూ నోటిఫికేషన్