ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతు భరోసా కేంద్రాల పేరుతో ప్రభుత్వం మోసం: దేవినేని - కౌలురైతు కుటుంబానికి మాజీ మంత్రి దేవినేని పరామర్శ

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లులో మృతి చెందిన కౌలు రైతు శివరామకృష్ణ కుటుంబాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమా పరామర్శించారు. శివరామకృష్ణ కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్​గ్రేషియా ప్రకటించాలని ఆయన డిమాండ్​ చేశారు.

devineni uma visitation of tenant farmer suicide
దేవినేని ఉమా

By

Published : Jan 30, 2021, 8:02 AM IST

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లులో మృతి చెందిన కౌలురైతు శివరామకృష్ణ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఎక్స్​గ్రేషియా ప్రకటించాలని మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి రైతు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. రైతు ఆత్మహత్య చాలా బాధాకరమన్నారు.

పంట చేతికొచ్చే తరుణంలో ఈ ఏడాది అధిక వర్షాల వల్ల రైతులు పూర్తిగా నష్టపోయారని చెప్పారు. కౌలు రైతుల వరుస ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి స్పందించకపోవడం ఏంటని ప్రశ్నించారు. రైతు భరోసా కేంద్రాలతో ఈ ప్రభుత్వం మోసం చేస్తోందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా పంట నష్టపరిహారం ప్రకటించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details