ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రశ్నించే వ్యక్తిని హత్య చేయటం దారుణం' - devineni uma in munagacharla

హత్యకు గురైన యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ కుటుంబాన్ని మాజీమంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరామర్శించారు. తెదేపా తరఫున లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు.

devineni uma
గంటా నవీన్ కుటుంబాని దేవినేని ఉమా పరామర్శ

By

Published : Jun 23, 2020, 12:27 PM IST

కృష్ణా జిల్లా నందిగామ మండలం మునగచర్ల గ్రామానికి చెందిన గంటా నవీన్ కుటుంబాన్ని మాజీమంత్రి దేవినేని ఉమా, మాజీఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరామర్శించారు. ఓ యూట్యూబ్ ఛానల్​లో రిపోర్టర్​గా పనిచేస్తున్న నవీన్​ను కొందరు హత్య చేశారు. ఆ కుటుంబానికి ఆర్థిక సాయంగా తెదేపా తరఫున లక్ష రూపాయలను కుటుంబసభ్యులకు అందజేశారు. ప్రశ్నించే వ్యక్తిని హత్య చేయటం దారణమని దేవినేని ఉమా పేర్కొన్నారు. ఇది ఒక వ్యక్తి చేసినది కాదనీ... దీని వెనుక ఎంత పెద్దవారు ఉన్నా బయటకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. నవీన్ హత్యపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details