మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టును తెదేపా నేత దేవినేని ఉమా ఖండించారు. శాసనసభలో ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే... అనారోగ్యంతో ఉన్నా తప్పుడు కేసులతో కిడ్నాప్ చేశారని ఆరోపించారు. దీనికి ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇది బీసీ వర్గాలపై దాడి అని అభివర్ణించారు. రాజకీయ కక్ష సాధింపు కాదా అని నిలదీస్తూ ట్వీట్ చేశారు.
ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి: దేవినేని
తెదేపా నేత అచ్చెన్నాయుడు అరెస్టును దేవినేని ఉమా ఖండించారు. ఈ అరెస్టు రాజకీయ కక్ష సాధింపు కాదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి