హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పంచాయతీ ఆఫీసులకు, గ్రామ సచివాలయాలకు, వాటర్ ట్యాంక్‌లకు వేసిన వైకాపా రంగులను తీసివేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. అధికారులు ఆ ఆదేశాలను అమలు చేయలేని పక్షంలో వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైలవరం నియోజకవర్గంలో వైసీపీ నాయకుల ఆగడాలు రోజు రోజుకు అధికమయ్యాయని తెలిపారు. అధికారులపై, తెదేపా నాయకులపై అధికార పార్టీ నాయకులు ఇలా చేయడం సిగ్గు చేటన్నారు. పురగుట్ట భూముల్లోని రాళ్లను కూడా వదలకుండా రంగులు వేయడం దారుణమన్నారు.
'హైకోర్టు ఆదేశాలు పెడచెవిన పెడతారా...!' - devineni uma latest news
కృష్ణా జిల్లా మైలవరంలోని గ్రామ సచివాలయాలను మాజీ మంత్రి దేవినేని ఉమ సందర్శించారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా... అధికారులు ఇంకా కార్యాలయాలకు ఎందుకు రంగులు మార్చలేదంటూ మండిపడ్డారు.
'హైకోర్టు ఆదేశాలు పెడచెవిన పెటతారా...!'