తప్పుడు కారణాలు సాకుగా చూపిస్తూ.. తెదేపా నేతల నామినేషన్లను అధికార పార్టీ నాయకులు అడ్డుపడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఆరోపించారు. 90శాతం పైగా నామినేషన్లు దాఖలు కావాల్సి ఉందని తెలిపారు. ప్రజలు ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ప్రజా వ్యతిరేకంగా పాలన చేస్తున్న జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే అవకాశమొచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వం నవ మాసాల్లో నవ మోసాలు చేసిందని ఆయన ఎద్దేవా చేశారు. భయంతోనే కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలు వాయిదా వేశారని ఆరోపించారు.
'ఆలోచించి ఓటు వేయండి... రాష్ట్రాన్ని కాపాడండి!' - municipal elections news at Vijayawada
స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఓటర్లను కోరారు. మంత్రులు ఉన్న నియోజకవర్గాల్లో 90 శాతం పైగా గెలవకుంటే 25 మంది మంత్రులు రాజీనామ చేయాలని జగన్ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపాను గెలిపించమని కోరుతున్న దేవినేని