పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం తెదేపా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే పోలవరం డయాఫ్రం వాల్ వరద బారిన పడిందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలు బయటపడుతున్నా.. మంత్రి అనిల్ కుమార్ ఇతరులపై అవాకులు.. చెవాకులు పేలడం సిగ్గుచేటన్నారు.
'ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే.. పోలవరం డయాఫ్రం వాల్ వరద బారిన పడింది' - పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ వార్తలు
పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్(ఊట నియంత్రణ గోడ) గోదావరి వరద ఉద్ధృతికి ధ్వంసమైంది. దీనిపై మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రభుత్వ అసమర్ధత వల్లే పోలవరం డయాఫ్రం వాల్ వరద బారిన పడిందని ఆరోపించారు. వైఫల్యాలు బయటపడుతున్నా.. మంత్రి అనిల్ కుమార్ ఇతరులపై అవాకులు.. చెవాకులు పేలడం సిగ్గుచేటన్నారు.
మాజీ మంత్రి దేవినేని ఉమా
వైకాపా అధికారం చేపట్టిన వెంటనే ఇంజినీరింగ్ అధికారులు డయాఫ్రం వాల్ రక్షణ కోసం చేపట్టాల్సిన చర్యలు సూచించినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని మండిపడ్డారు. పురోగతిలో ఉన్న పనులను అర్ధాంతరంగా నిలిపివేసి.. ఇప్పుడు ఇతరులపై అభాండాలు వేయాలనుకోవడం సరికాదన్నారు. ఎన్ని బెదిరింపులకు గురిచేసినా పోలవరం విషయంలో వాస్తవాలను ప్రజలకు చెబుతూనే ఉంటామని దేవినేని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:దివిసీమలో శివాలయాలకు పోటెత్తిన భక్తులు
TAGGED:
polavaram project news