ఏడాదిన్నరగా పోలవరం ప్రాజెక్టుకు భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కింద ఎంత ఖర్చు చేశారో సీఎం జగన్ సమాధానం చెప్పాలని మాజీమంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. వైఎస్ హయాంలో జగన్ పవర్ ప్రాజెక్టు కోసం తీసుకున్న నిర్ణయాల వల్ల పోలవరంపై అదనంగా రూ. 2537కోట్ల భారం పడిందన్నారు. ఇప్పుడు రివర్స్ టెండరింగ్ డ్రామాలతో మరో రూ.7500కోట్లు చేకూరిందన్నారు. హైదరబాద్ కు బస్సులు నడపలేనివాళ్లు రాష్ట్రాన్ని ఏం పాలిస్తారని దేవినేని.. ఎద్దేవా చేశారు.
'పోలవరం ప్రాజెక్టుకు ఎంత ఖర్చు చేశారో సీఎం చెప్పాలి' - పోలవరం ప్రాజెక్టు లెక్కపై దేవినేని ఉమా వ్యాఖ్య
పోలవరం ప్రాజెక్టుకు భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కింద ఎంత ఖర్చు చేశారో సీఎం జగన్ చెప్పాలని దేవినేని ఉమా ప్రశ్నించారు. ఈ ఏడాది మే నాటికి 18వేల మంది నిర్వాసితులకు ఇళ్లలను ఇస్తామని చెప్పిన మంత్రి అనిల్ మాట తప్పారని అన్నారు.
పోలవరం ప్రాజెక్టుపై దేవినేని వ్యాఖ్య
ఈ ఏడాది మే నాటికి 18వేల ఇళ్లలోకి నిర్వాసితుల్ని తరలిస్తామని డ్యాం సైట్ లో ప్రగల్భాలు పలికిన మంత్రి అనిల్... ముఖం చాటేశారని దుయ్యబట్టారు. తోటపల్లి ప్రాజెక్టు పూర్తిచేసుకోలేని మంత్రి బొత్స... పోలవరం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: 'రామసక్కనోడివిరో' అంటూ అలరిస్తోన్న అదాశర్మ