ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మంత్రులకు వారి శాఖలపై పట్టు లేదు' - tdp on ysrcp

మంత్రులకు వారి శాఖలపై పట్టులేదని, ఆదాయం ఎంతనేది కూడా చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉందని తెదేపా నేత దేవినేని ఉమా విమర్శించారు.

devineni uma on ysrcp one year rule
వైకాపా ఏడాది పాలనపై దేవినేని ఉమా

By

Published : May 30, 2020, 6:17 PM IST

వైకాపా ఏడాది పాలనలో పగ, ప్రతీకారం తప్ప ఏమీ లేదని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాండ్, ల్యాండ్, వైన్, మైన్ మాఫియాలతో వేల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. మంత్రులకు వారి శాఖలపై పట్టులేదని, ఆదాయం ఎంతనేది కూడా చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. మంత్రివర్గ సమావేశం ఎప్పుడో కూడా చెప్పలేని స్థితిలో మంత్రులు, ప్రభుత్వం ఉందని ఉమా దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details