'హైకోర్టు ఆదేశాలు సైతం బేఖాతరు చేస్తున్నారు' - స్థానిక ఎన్నికలపై దేవినేని ఉమ
కృష్ణా జిల్లా మైలవరంలో హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ వైకాపా నాయకులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో పంచాయతీ కార్యాలయాలకి పార్టీ రంగులు తొలగించకుండా... సీఎం జగన్ బొమ్మలకు తూతుమంత్రంగా కవర్లు కప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లను ఎన్నికల పనులకు ఉపయోగిస్తూ ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయంపై న్యాయ పోరాటం చేస్తామని దేవినేని ఉమా అన్నారు.
స్థానిక ఎన్నికలపై దేవినేని ఉమ