వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. కేంద్రం ఏపీలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్నారు. 24 గంటల్లో 61 కేసులు బయటపడితే ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు.
'ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కేసులు పెరుగుతున్నాయి' - tdp on corona cases in ap
కేంద్రం ఏపీలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని తెదేపా నేత దేవినేని ఉమా డిమాండ్ చేశారు. కేసులు పెరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
రాష్ట్రంలో కరోనా కేసులపై దేవినేని ఉమా
పంటలను కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. రబీలో ఎంత మేర ధాన్యం కొనుగోలు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. రూ.374 కోట్ల ధాన్యం బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్వా, మామిడి రైతుల సమస్యలు పరిష్కరించాలన్నారు. భవన నిర్మాణ కార్మికుల కుటుంబానికి రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఇంట్లోనే ఉన్న గృహిణికి కరోనా... అప్రమత్తమైన అధికారులు